ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానితో సీఎం జగన్ చర్చించినట్టు తెలుస్తోంది.

పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన రూ.3,800 కోట్లకుపైగా నిధులను విడుదల చేయాల్సిందిగా మోదీని సీఎం కోరినట్టు తెలుస్తోంది. మండలి రద్దు తీర్మాణంపై వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారమ్. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెంట ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, తదితరులు ఉన్నారు.