ఎస్వీబీసీలో పోర్న్ వివాదంపై సీఎం జగన్ ఆరా

ఏపీలో సంచలనం సృష్టించిన ఎస్వీబీసీలో పోర్న్ వివాదంపై సీఎం జగన్ ఆరా తీశారు. అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులను ఆదేశించారు.

ఎస్వీబీసీ ఛానల్‌ను ప్రక్షాళన చెయ్యాలని ఎస్వీబీసీ అధికారులకు తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతో శ్రీవారి విశిష్టతను వివరించేలా కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఎస్వీబీసీ వెబ్ సైట్ లో పోర్న్ వీడియోలు కనిపించడం వివాదాస్పదం అవ్వడం.. దీనిపై రాజకీయ పక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Spread the love