చినజీయర్‌ స్వామిని పరామర్శించిన కేసీఆర్

సీఎం కేసీఆర్ చినజీయర్‌ స్వామిని పరామర్శించారు. ఇటీవల చినజీయర్‌ మాతృమూర్తి అలివేలు మంగతాయారు (85) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దీంతో శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో ఉన్న చినజీయర్‌ ఆశ్రమానికి కేసీఆర్‌ వెళ్లి ఆయన్ను పరామర్శించారు.

సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగియగానే అటు నుంచే అటే.. చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. సీఎం కేసీఆర్‌తో పాటు మైహోం గ్రూపు ఛైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు తదితరులు ఉన్నారు.