గవర్నర్ కలిసిన కేసీఆర్

గవర్నర్‌ తమిళిసైను తెలంగాణ సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. తమిళిసై చిన్నాన్న కుమార్‌ శుక్రవారం మరణించారు. దీంతో కేసీఆర్‌ ఇవాళ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను పరామర్శించారు.

అదే సమయంలో అసెంబ్లీ సమావేశాల గురించి సమాచారం ఇచ్చినట్టు ఉంటుందని తెలుస్తోంది. సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలో ప్రవేశపెట్టబోయే బిల్లుల గురించి గవర్నర్ తమిళిసైకి తెలియజేశారు.