హైదరాబాద్ లో అల్లర్లకు కుట్ర

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో అల్లర్లకు కుట్ర జరుగుతోందంటూ స్వయంగా సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలను వాయిదా వేసేందుకు అసాంఘిక శక్తులు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. అయితే సీఎం కేసీఆర్ స్టేట్ మెంట్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌ ప్రజలను భయపెట్టేలా ఆరోపణలు చేస్తున్నారని.. గ్రేటర్‌ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇతరులపై నిందలు మోపుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి.. ఓటు వేయకుండా ఉండేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

బీజేపీపై అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను భయపెడుతున్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటేయకుండా ఉండేందుకు కుట్రలు చేస్తున్నారు. కేసీఆర్.. అధికారం శాశ్వతం కాదు. ఇతర పార్టీలపై బురద జల్లడం ఎంత వరకు సమంజసం. ప్రజలెవరూ భయపడవద్దు. మీకు అండగా ఉంటాం అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Spread the love