బ్రేకింగ్ : కోవాగ్జిన్‌ టీకాని తీసుకున్న హర్యాన మంత్రి

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్‌ టీకాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. ఇవాళ కోవాగ్జిన్‌ మూడవ దశ ట్రయల్స్ దేశంలో ప్రారంభం అయ్యాయి.

ఈ నేపథ్యంలో హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్‌.. కోవాగ్జిన్‌ టీకా ట్రయల్ డోసు తీసుకున్నారు. అంబాలాలోని ఓ హాస్పిటల్‌లో ఆయన ఇవాళ కోవిడ్ టీకాను వేయించుకున్నారు. వాలంటీర్ రూపంలో కోవాగ్జిన్‌ టీకా వేయించుకున్నారు.