రామతీర్థం ఘటనపై కమిటీ ప్రకటించిన జనసేన

రామతీర్థం ఘటనపై భాజాపా-జనసేన ఉమ్మడి పోరుకు రెడీ అయ్యాయ్. ఇందుకోసం జనసేనాని పవన్ కల్యాణ్ ఓ కమిటీని ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ నేతృత్వం లో నలుగురు సభ్యులు కమిటీని ఆయన ప్రకటించారు. సభ్యులుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు పాలవలస యశస్విని, పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ కమిటీ సభ్యులు గడసాల అప్పారావు, డాక్టర్ బొడ్డేపల్లి రఘులు ఉన్నారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… రామతీర్థంలో ఘటన జరిగి వారాలు గడుస్తున్నా ఈ కేసులో ఇంత వరకు ఎటువంటి పురోగతి లేదని అన్నారు. తమకు స్వేచ్ఛను ఇస్తే ఎటువంటి జఠిలమైన కేసునైనా పరిష్కరిస్తామని పోలీసు అధికారులు తరచూ ఆఫ్ ది రికార్డుగా చెబుతుంటారని ఆయన అన్నారు. మరి ఈ కేసులో పోలీసులకు పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇవ్వలేదని అనుమానించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు.

Spread the love