ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణలో ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఎంసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌, ఎడ్‌ సెట్‌, పీజీఈసెట్‌, పీఈసెట్‌, లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. అయితే, ఇప్పుడీ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువుని పెంచారు.

జూన్‌ 10 వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి సూచించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పదో తరగతి, ఇంటర్ పరీక్షలని నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే కరోనా ఎఫెక్ట్ తో ఈ యేడాది రెండ్నెళ్లు ఆలస్యంగా విద్యా సంస్థలు ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జులై లేదా ఆగస్టులో స్కూల్స్, కాలేజీలు తెరచుకొనే అవకాశాలున్నాయి.