ఫేక్ ఓట్లు.. తలసానిపై ఫిర్యాదు !

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి. ఈ సారి గాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఫేక్ సర్టిఫికెట్ల ఆధారంగా…ఓటర్లను నమోదు చేస్తున్నట్లు అనుమానం కలుగుతోందన్నారు.

ఈ విషయాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఫేక్ సర్టిఫికేట్లను గుర్తించడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి తలసానిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని శశిధర్‌రెడ్డి చెప్పారు. గత ఏడాది గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయిందని మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు.