ఒంటరైపోయిన మాస్టరు

ప్రొఫెసర్ కోదండరామ్ ఒంటరి అయిపోయారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి కోదండరామ్ పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో తాను కచ్చితంగా గెలుస్తానని ధీమాగా ఉన్న కోదండరామ్… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలో నిలపకుండా తనకు మద్దతు ఇస్తుందని ఆయన భావిస్తూ వచ్చారు. కాంగ్రెస సైతం ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని చెబుతూ కొన్ని నెలలుగా కోదండరామ్‌ను ఊరిస్తూ వచ్చింది. అయితే తాజాగా కోదండరామ్‌కు షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైనట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు… ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల కమిటీలపై చర్చించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్.. అధిష్టానాన్ని కలిసి అభ్యర్థుల ఎంపికపై చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే… రంగారెడ్డి.. హైదరాబాద్.. పాలమూరు నియోజకవర్గం నుండి … మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి , వంశీ పేర్లతో పాటు… ఉపాధ్యాయ సంఘం నుండి హర్ష వర్ధన్ పేరు కూడా హైకమాండ్‌కు పంపుతున్నారు. ఇక..వరంగల్..ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుండి… మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, బెల్లయా నాయక్ పేర్లు చర్చకు వచ్చాయి. అటు మానవతా రాయ్ పేరు కూడా పరిశీలిస్తున్నారు.

Spread the love