కరోనా మరణాల్లో భారత్ పైపైకి

భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లో 37,724 పాజిటివ్‌ కేసులు, 648 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 11,92,915కు చేరగా, వీరిలో ఇప్పటివరకు 28,732 మంది మృత్యువాతపడ్డారు.

మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 7,53,050 మంది రోగులు కోలుకోగా మరో 4,11,133 క్రియాశీల కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా లెక్కలతో భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక కొవిడ్‌ మరణాలు చోటుచేసుకున్న దేశాల జాబితాలో 7వ స్థానానికి చేరింది. ఇప్పటివరకు 28,400 మరణాలతో ఈ స్థానంలో ఉన్న స్పెయిన్‌ ప్రస్తుతం 8వ స్థానంలోకి వెళ్లింది. కొవిడ్‌ కేసుల్లో మాత్రం భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది.