వైవీ సుబ్బారెడ్డికి కరోనా

ఏపీలో కరోనా బారినపడుతున్న ప్రజా ప్రతినిధుల జాబితా పెరుగుతూనే ఉంది. ఇటీవల కరోనా బారినపడి కోలుకున్న మంత్రి వెల్లంపల్లి అరోగ్యం పరిశస్థితి విషమించింది. దీంతో ఆయన్ని హుటాహుఠిన హైదరాబాద్ తరలించారు. చికిత్స అందిస్తున్నారు. తాజాగా టీటీడీ చైర్మెన్ వైసీ సుబ్బారెడ్డికి కరొనా పాజిటివ్ గా తేలింది. కోవిడ్ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.

దీంతో, ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి కరోనాకు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుబ్బారెడ్డిని ముఖ్యమంత్రి జగన్ టీటీడీ ఛైర్మన్ గా నియమించారు.