ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసుల

తెలుగు రాష్ట్రంలో ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజువారీగా తగ్గుముఖం పట్టినట్టే కనిపించింది. వారంలో రెండు మూడ్రోజులు కేసుల సంఖ్య తగ్గాయి. అయితే తాజాగా కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 66 కేసులు నమోదయ్యాయి. దీంతో.. మొత్తం కేసుల సంఖ్య 2627కు చేరుకుంది.

కొత్తగా నమోదైన ఈ కేసుల్లో దుబాయ్-03, కువైట్-12, కత్తర్-02 నుంచి వచ్చిన 17 మంది ఉన్నారు. చిత్తూరు-03, నెల్లూరు-08 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు ఏపీలో కరోనా నుంచి కోలుకొని 1807 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కాటుకు 56 మంది మృతి చెందారు.