తెలంగాణకు చేరిన కరోనా వాక్సిన్లు

ఈ నెల 16 నుంచి తెలంగాణలో కరోనా వాక్సిన్ల పంపిణీ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే 20వేల కరోనా వాక్సిన్లు తెలంగాణకు చేరాయి. ఇక తొలి విడతగా 139 సెంటర్లలో వ్యాక్సినేషన్‌ ఇస్తారు. తొలిరోజు ఒక్కోసెంటర్‌లో 30 మందికి టీకా పంపిణీ చేస్తారు.

ప్రభుత్వ హెల్త్ కేర్ వర్కర్స్, ప్రైవేట్ వర్కర్స్‌కు టీకా ఇస్తామని అధికారులు చెబుతున్నారు. 18 నుంచి వ్యాక్సిన్ కేంద్రాలు పెంచుతామని అధికారులు తెలిపారు. ఇప్పటికే వ్యాక్సిన్ కోసం 3.32 లక్షల మంది హెల్త్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.కోఠిలోని శీతల గిడ్డంగి నుంచి కరోనా వ్యాక్సిన్‌ను జిల్లాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

Spread the love