ఫైన్ ల్యాండ్ మాజీ అధ్యక్షుడికి కరోనా

కరోనా ప్రపంచ దేశాలని గజగజ వణికిస్తోంది. దేశ అధ్యక్షులు, ప్రధాన మంత్రులు, సెలబ్రేటీలు ఈ వైరస్ బారీన పడుతున్నారు. ఫైన్ ల్యాండ్ మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మార్టి ఆహ్టిసారి కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఫిన్ ల్యాండ్ అధ్యక్షుని కార్యాలయం ధ్రువీకరించింది.

అంతేకాదు.. మార్టి భార్య ఈవాకు కూడా వైరస్ సోకినట్లు సమాచారం. 82 ఏళ్ల మార్టి.. 1994 నుంచి 2000 వరకు ఫైన్ ల్యాండ్ అధ్యక్షుడిగా సేవలందించారు. ఆయన సేవలకుగాను 2008లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. ఇక ఇప్పటివరకు 792 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఒక్కరే మరణించారు