కరోనా.. మరో మూడు కొత్త లక్షణాలు !

కరోనా మహమ్మారి సోకిన వారిలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటివి లక్షణాలుగా ఉంటాయి. తాజాగా ఈ లిస్టులోకి కొత్తగా మరో మూడు లక్షణాలు చేరాయి. అమెరికాకు చెందిన హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేసిన ఓ అధ్యయనంలో పై లక్షణాలే కాకుండా కొత్తగా మరో మూడింటిని గుర్తించారు.

వాంతులు, విరేచనాలు మరియు ముక్కు కారటం కూడా కరోనా లక్షణాలే అని తేల్చారు. గొంతు మంట. అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం లాంటివి కూడా కరోనా లక్షణాలు అని ఈ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలిపింది. మరోవైపు ఎలాంటి లక్షణాలు లేనివాళ్లకు కరోనా పాజిటివ్ గా తేలుతుందని చెబుతున్నారు.