కరోనా మళ్లీ ఉగ్రరూపం

కరోనా మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. అమెరికాలో నిమిషానికి ఒకరు కరోనాతో మరణిస్తున్నారు. ఇప్పటివరకు 2.5 లక్షలకు పైగా అమెరికన్లను మహమ్మారి బలి తీసుకుంది. ప్రస్తుతం అక్కడ 45.71 లక్షలకు పైగా యాక్టివ్‌ కేసులున్నాయి.

కరోనా రోగులకు సరిపడినంత స్థాయిలో పడకలు లేక.. ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, విశ్రాంతి సముదాయాలు సహా వాహనాల పార్కింగ్‌ ప్రదేశాల్లోనూ పడకలు ఏర్పాటు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రెండు, మూడు వారాల క్రితం.. రోజుకు 70-80 వేల కొత్త కేసులు నమోదయ్యేవి. కానీ, ఒక్కరోజే లక్షా 55వేలకు పైగా నమోదయ్యాయి.

Spread the love