దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

వాక్సిన్ వచ్చినా.. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, పంజాబ్, కేరళ, రాష్ట్రాల్లో రోజువారీ కేసులు మళ్లీ గణనీయంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ రాష్ట్రాలన్నీ జాగ్రత్తగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటించడంలో అలసత్వం ప్రదర్శించొద్దని సూచించింది. ఈనెల 13 నుంచి మధ్యప్రదేశ్ లో కొత్త కేసులు పెరుగుతున్నాయని తెలిపింది.

మహారాష్ట్ర, కేరళలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. గత 24 గంటల్లో ఈ రెండు రాష్ట్రాల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య 75.87 శాతంగా ఉందని తెలిపింది. ఇదే సమయంలో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు సున్నాగా ఉన్నాయని వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాలోనూ గత కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే.

Spread the love