ఒక్క నెలలోనే 65 లక్షల కేసులు

ఐసీఎంఆర్‌ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. మే నెల నాటికే దేశంలో దాదాపు 64 లక్షల మందికి కరోనా సోకి ఉంటుందని అంచనా వేసింది, ఈ మేరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన సీరో సర్వే ఫలితాలను ఐసీఎంఆర్‌ ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చిలో ప్రచురించింది.

దేశంలో 0.73 శాతం మంది మధ్య వయస్కులు మే నెల నాటికే కొవిడ్‌ బారిన పడ్డారని సర్వేలో తేలింది. వీరిలో 43.3 శాతం మంది 18-45 ఏళ్ల వయస్సు మధ్యనున్నవారే. 46-60 ఏళ్ల మధ్య వయస్సు వారిలో 39.5 శాతం మంది, 60 ఏళ్ల పైబడిన వారిలో 17.2 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు గుర్తించినట్లు సర్వే తెలిపింది.