దేశంలో 55,722 కొత్త కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో 55,722 కరోనా కేసులు నమోదయ్యాయ్.  దీంతో మొత్తం కేసుల సంఖ్య 75,50,273కు చేరింది. గడిచిన 24 గంటల్లో 579 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,14,610గా నిలిచింది.

వరుసగా 16వ రోజు కొత్త కేసుల కంటే కోలుకొని ఇంటికి వెళ్లిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. రికవరీల రేటూ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 88.26 శాతం మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం నమోదైన కేసుల్లో కేవలం 10.23 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరణాల రేటు 1.52 శాతానికి తగ్గింది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 66,63,608 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 7,72,055 క్రియాశీల కేసులు ఉన్నట్లు తెలిపింది.  గత కొన్ని రోజులుగా కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.