దేశంలో 44,376 కొత్త కేసులు

దేశంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 44,376 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 92,22,217కి చేరింది. ఇక గత 24 గంటల్లో 37,816 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంటల సమయంలో 481 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,34,699 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 86,42,771 మంది కోలుకున్నారు. 4,44,746 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది

Spread the love