కరోనా కేసులు : తెలంగాణ 41, ఏపీ 9

తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజూకి కరోనా విజృంభిస్తోంది. తెలంగాణలో ఇప్పటివరకూ పాజిటివ్ కేసుల సంఖ్య 41కి చేరుకుంది. సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల బాలుడికి కూడా కరోనా లక్షణాలను వైద్యులు గుర్తించారు. ప్రైమరీ కాంటాక్ట్‌తో 43 ఏళ్ల మహిళకు కూడా కరోనా సోకినట్లు చెబుతున్నారు. ఇక ఏపీలో కరోనా కేసుల సంఖ్య 9కి చేరింది.

ఏపీలో బుధవారం ఒక్కరోజే మరో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కేసులు మొత్తం 9కి చేరుకున్నాయి. విజయవాడ, గుంటూరుకు చెందిన ఇద్దరి వ్యక్తులకు పాజిటివ్‌గా తేలింది. వాషింగ్టన్‌ నుంచి విజయవాడకు వచ్చిన 22 ఏళ్ల యువకుడితో పాటు ఢిల్లీలో ప్రత్యేక ప్రార్థనలకు వెళ్లి గుంటూరు వచ్చిన 55 ఏళ్ల వ్యక్తికి కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.