ఒక్కరోజే లక్ష కరోనా కేసులు నమోదు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లోనే ప్రపంచ వ్యాప్తంగా లక్ష కేసులు నమోదు కావడం కలవర పెడుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 51 లక్షలు దాటింది.

ఇందులో యాక్టివ్‌ కేసుల సంఖ్య 27 లక్షల 46 వేలు. ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ తర్వాత 20 లక్షల 43 వేల మందికి పైగా వ్యాధి నుంచి బయటపడి ఇళ్లకు వెళ్లిపోయారు. కరోనాకాటుకు 3 లక్షల 32 వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఇక అమెరికా, రష్యాలో ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.