కరోనా ఎఫెక్ట్.. అప్పులపాలైన నటి !

కరోనా కష్టాలు సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకి తప్పడం లేదు. వారు డబ్బులు లేక అప్పులు చేస్తున్నారు. తాజాగా టీవీ సీరియల్ నటి సోనాల్ వెంగర్లేకర్ డబ్బు లేక చాలా ఇబ్బంది ఎదుర్కొందట. ఈ లాక్ డౌన్ వలన ఈ రెండు నెలల్లో తన వద్ద ఉన్న మనీ మొత్తం అయిపోయాయ్. తనకు రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన నిర్మాత మొహంచాటేశాడు.

చివరికి తన మేకప్ మ్యాన్ దగ్గర అప్పు చేయాల్సి వచ్చింది. ‘తన వద్ద 15 వేల రూపాయలు ఉన్నాయని కావాలంటే మీరు తీసుకొని.. తన భార్య డెలివరీ సమయానికి అందిస్తే చాలని మేకప్ మేన్ పంకజ్ గుప్పా చెప్పాడట. మేకప్ మ్యాన్ మంచితనాని చూసి కన్నీటి పర్యంతం అయ్యానని సోనాల్ తెలిపింది.