ఆసీస్ లో లాక్‌డౌన్.. నాల్గో టెస్ట్ కష్టమే !

భారత్-ఆసీస్ జట్ల మధ్య నాల్గు టెస్టుల సీరీస్ లో ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్ లు పూర్తయ్యాయ్. ఇరు జట్లు చెరో మ్యాచ్ నెగ్గాయ్. ప్రస్తుతం మూడో టెస్ట్ జరుగుతోంది. మరో మూడ్రోజుల ఆట మిగిలిఉంది. ఇక బ్రిస్బేన్ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య నాల్గో టెస్ట్ జరగాల్సి ఉంది. ఈనెల 15 నుంచి ప్రారంభం కావాల్సి వుంది. తాజాగా ఈ చివరి టెస్టుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

తాజాగా అక్కడ మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించడమే అందుకు కారణం. ఇప్పటికే ఆ నగరంలో యూకే స్ట్రెయిన్‌ కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసును గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ విషయంపై అటు క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) సైతం కంగారు పడుతోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Spread the love