కరోనాతో.. వెలుగులోనికి కొత్త సమస్య !

కరోనా వైరస్‌కు సంబంధించిన లక్షణాలు కొత్త కొత్తవి వెలుగులోకి వస్తున్నాయ్. తాజాగా కరోనాతో బ్రెయిన్ డ్యామేజ్‌ అవుతున్నట్టు ఎయిమ్స్ డాక్టర్లు గుర్తించారు. కరోనా కారణంగా ఓ చిన్నారి మెదడులోని నాడులు దెబ్బతినడంతో ఆమె చూపు మందగించినట్టు తెలిపారు.. చైల్డ్ న్యూరాలజీ విభాగం శాస్త్రవేత్తలు గుర్తించారు.

కోవిడ్ బారినపడిన 11 సంవత్సరాల బాలికలో సంబంధిత వైరస్ కారణంగా ఎక్యూట్ డీమైలినేటింగ్ సిండ్రోమ్ (ఏడీఎస్) వ్యాధిని గుర్తించామని.. ఈ ఏజ్‌ పిల్లల్లో ఇటువంటి వ్యాధి రావడం ఇదే తొలిసారి అంటున్నారు ఎయిమ్స్ వైద్యులు.. మెదడు నాడుల్లోని కణాల చూట్టూ మైలిన్ పొర ఉంటుందని.. కణాల ద్వారా జరిగే సమాచార మార్పిడికి ఈ పొర ఎంతో కీలకమైనది. అయితే, కరోనా వైరస్ కారణంగా.. ఈ పొర దెబ్బతినడంతో నాడి వ్యవస్థపై ప్రభావం పడినట్టుగా చెబుతున్నారు.