కరోనా.. కొన్ని లాభాలు కూడా !

కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. ఈ మహమ్మారి భయానికి గజ గజ వణికిపోతున్నారు. ఈ కష్టాలతోపాటు కాస్త మేలు కూడా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రపంచ వాయు కాలుష్య స్థాయులు తగ్గుతున్నట్లు వెల్లడైంది. జనతా కర్ఫ్యూ పాటించిన రోజైన ఈ నెల 22న పరిశీలించినపుడు భారత దేశంలోని మెట్రో నగరాల్లో గాలిలో నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయి బాగా తగ్గింది.

ఇక కరోనా ఎఫెక్ట్ తగ్గాక.. వైద్య రంగంలో విప్లవం రానుంది. అంతేకాదు.. కోవిడ్-19 సంక్షోభం ముగిసిన తర్వాత ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగాలను మూసివేయడానికి బదులుగా భారీ కాలుష్య కారకులకు ఉద్గారాల ప్రమాణాలను అమలు చేయడం వంటి చర్యలను చేపట్టి, గాలి కాలుష్యాన్ని పరిష్కరించవలసి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.