222 మంది పోలీసులకి కరోనా

మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. పోలీసులు భారీ సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. గడిచిన 48 గంటల్లో 222 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ముగ్గురు పోలీసులు కరోనాతో ప్రాణాలు విడిచారు. మొత్తంగా మహారాష్ట్రలో 5,935 మంది పోలీసులకు కరోనా సోకింది. ఇప్పటి వరకు 74 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.

ఇక మహారాష్ట్రలో మొత్తం 2,30,599 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. 9,667 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 93,654 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కరోనా నుంచి 1,27,259మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Spread the love