బాలాపూర్ ఏఎస్ఐ కి కరోనా

బాలాపూర్ ఏఎస్ఐ సుధీర్ కృష్ణకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన్ని గాంధీ ఆసుపత్రికి చికిత్స అందిస్తున్నారు. ఎస్ఐ కి కరోనా పాజిటివ్ అని తేలడంతో.. పోలీస్ స్టేషన్ సిబ్బందిలోనూ కరోనా కలవరం నెలకొంది.

రెండు మూడు రోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నాడు. బాలాపూర్ ఆరోగ్య కేంద్రంలో వైద్యులను సంప్రదించగా వారు ఫీవర్ దవాఖానకు తరలించి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతరం ఆయనను చికిత్స కోసం గాంధీకి తరలించారు. పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న 30 మంది సిబ్బంది నుంచి రక్త నమూనాలను సేకరిస్తున్నారు. మరో రెండు రోజుల్లో బాలాపూర్ వైద్య సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు చేయనున్నారు.