తెరాస ఎంపీకి కరోనా

తెలంగాణలో కరోనా బారినపడుతున్న ప్రజా ప్రతినిధుల జాబితా పెరుగుతోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్‌, మంత్రి హరీష్ రావు పలువురు ఎమ్మెల్యేలు, హైదరాబాద్ మేయర్ ఇలా.. చాలా మంది ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డారు.. వీరిలో పలువురు ఇప్పటికే పూర్తిస్థాయిలో కోలుకున్నారు.

తాజాగా ఎంపీ బీబీ పాటిల్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ లో వెల్లడించారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. తనను కలిసిన నేతలు, నాయకులు, ప్రజలు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. ఇక యాదాద్రి-భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డికి కరోనా బారిపడ్డారు. దీంతో ఆయన హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు.