చెన్నై సూపర్‌ కింగ్స్’లో కరోనా కలకలం

ఐపీఎల్-2020 ప్రారంభం కాకముందే చెన్నై సూపర్‌ కింగ్స్‌కు షాక్ తగిలింది. టీ20ల్లో టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక పేసర్‌, సామాజిక మాధ్యమ సిబ్బంది, నిర్వాహక బృందంలోని సీనియర్‌ అధికారి, ఆయన సతీమణికి కరోనా వైరస్‌ సోకిందని సమాచారం.

ధోనీ సేన ఈ నెల 21న దుబాయ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత బీసీసీఐ నిర్వాహక ప్రక్రియ ప్రకారం బృందానికి వరుసగా ఒకటి, మూడు, ఆరో రోజు ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. అందులోనే కొంతమందికి పాజిటివ్‌ వచ్చినట్టు దుబాయ్‌ వర్గాలు తెలిపాయి.