సీఎంకు కరోనా పాజిటివ్

సామాన్యులు, సెలబ్రీటీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రధానులు, దేశాధినేతలు కరోనా కూడా కరోనా బారినపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. కరోనా లక్షణాలు లేవు అని చెప్పారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఇంటి నుంచే తన కార్యకలాపాలు కొనసాగిస్తానని తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సీఎం సావంత్ విజ్ఞప్తి చేశారు.