మరో నటుడికి కరోనా

కరోనా బారినపడుతున్న నటీనటుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా టాలీవుడ్‌లో మరో నటుడికి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్దారణ అయింది. హర్షవర్ధన్ రాణే అనే నటుడికి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ విషయాన్ని అతడు ట్విట్టర్ ద్వారా అభిమానవులతో పంచుకున్నాడు. వైద్య పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపాడు. జ్వరం, కడుపునొప్పి లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రికి వెళ్లగా, అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించారని తెలిపాడు. 10 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటున్నానని పేర్కొన్నాడు.

‘తకిట తకిట’ సినిమాతో తెరంగేట్రం చేసిన హర్షవర్ధన్ రాణే ‘అవును’, ‘అవును-2’, ‘ఫిదా’ సినిమాలో నటి సాయిపల్లవి పక్కింటి కుర్రాడి పాత్రలో నటించాడు. బాలీవుడ్‌లో ‘సనమ్ తేరి కసం’ అనే సినిమాలో నటించాడు. ఇక ఇప్పటికే దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, నటి తమన్నా కరోనా వైరస్ మారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.