కాంగ్రెస్ ఎంపీ కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డికి కరోనా

తెలంగాణలో కరోనా బారినపడుతున్న ప్రజా ప్రతినిధులుజాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కరోనా బారిన పడ్డారు. రీసెంట్ గా ఆయన కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు లేనప్పటికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇటీవల తనను కలిసిన నేతలు, నాయకులు, ప్రజలు కరోనా టెస్టులు చేయించుకోవాలని వెంకట్ రెడ్డి కోరారు

ఇక ఇప్పటికే దేశంలో అనేకమంది రాజకీయ నాయకులు కరోనాబారిన పడ్డారు. కొందరు కరోనాకు బలయ్యారు. గల్లీ నాయకుల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా బారినపడిన మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి.. దాని నుంచి కోలుకొన్నారు. ఆ తర్వాత ఇతర సమస్యలతో ఆసుపత్రిలో చేరి మృతి చెందిన సంగతి తెలిసిందే.