ఏపీ మండలి చైర్మన్‌ షరీఫ్‌కు కరోనా

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఏపీ శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌ కరోనా బారినపడ్డారు. ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేకాదు.. ఇటీవల షరీఫ్ ని కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని తెదేపా నేతలు సూచిస్తున్నారు.

మరోవైపు కరోనా కేసుల నమోదులో సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్‌ దేశంలో రెండో స్థానానికి చేరింది. ఇప్పటివరకూ ఆ స్థానంలో ఉన్న తమిళనాడును వెనక్కు నెట్టి ఆ స్థానాన్ని ఏపీ ఆక్రమించింది. మహారాష్ట్ర 7,80,689 కేసులతో తొలిస్థానంలో ఉంది. తాజాగా కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల మేరకు 1.40 లక్షల కేసులతో ఆగస్టులోకి ప్రవేశించిన ఆంధ్రప్రదేశ్‌ 31 వతేదీ సాయంత్రానికి 4,34,771 కేసులకి చేరింది.