తెలంగాణ హోంమంత్రికి కరోనా

తెలంగాణలో ప్రజాప్రతినిధులనూ కరోనా‌ వదలడం లేదు. ఇప్పటికే ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీకి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఆయన ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

గత కొద్దిరోజులుగా కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తుండటంతో నిన్న రాత్రి ఆయనకు కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. ఇటీవల మంత్రి సెక్యూరిటీ సిబ్బందిలో కొందరికి కరోనా సోకింది. ఆ సమయంలోనే మంత్రి టెస్టులు చేస్తే నెగటివ్ వచ్చింది. అయితే మూడ్రోజుల తర్వాత చేసిన టెస్టుల్లో పాజిటివ్ గా తేలింది.