కరోనాతో మాజీ మంత్రి మృతి

కరోనా బారినపడిన మాజీ మంత్రి మాతంగి నర్సయ్య కన్నుమూశారు. ఈ మధ్యే కరోనా బారిన పడిన మాతంగి నర్సయ్య .. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మంగళవారం కన్నుమూశారు. నర్సయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

నర్సయ్య అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని, సంబంధిత ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ఈ మేరకు మాతంగి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మేడరాం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి నర్సయ్య చేసిన కృషిని కేసీఆర్ గుర్తు చేశారు.