‘పద్మారావు’ కరోనా.. కేటీఆర్ ఆసక్తికర కామెంట్ !

ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తెలంగాణలో ఉపసభాపతి పద్మారావుకు కరోనా సోకింది. దీనిపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర విషయం చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఉపసభాపతి పద్మారావుకు తాను మాస్క్‌ ఇచ్చానని.. అయితే ఆయన ధరించకుండా జేబులో పెట్టుకున్నారని గుర్తు చేశారు.

‘ఏం కాదు హైదరాబాద్ వాళ్లం గట్టిగా ఉంటామ’ని పద్మారావు అన్నారని కేటీఆర్‌ చెప్పారు. ఇప్పుడు ఆయనకు కరోనా సోకిందని కేటీఆర్‌ అన్నారు. జాగ్రత్తలు పాటించడం మన కోసమే కాదు.. మన కుటుంబ సభ్యులకు రక్షణ కోసమని కేటీఆర్‌ తెలిపారు. కరోనా నుంచి రక్షణ పొందే విషయంలో ఎవరికి వారు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేటీఆర్‌ చెప్పారు.

Spread the love