ఏపీలో మరో మంత్రికి కరోనా

ఏపీలో కరోనా బారినపడుతున్న ప్రజా ప్రతినిధుల జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అలాగే తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కరోనా సోకింది. ఏపీ శాసన మండలి చైర్మన్ ఎం.ఎ షరీఫ్ కి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్ కావడంతో.. హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.