ఎమ్మెల్యే రోజా గన్ మెన్ కు కరోనా

తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ప్రతినిధులు, వారి వ్యక్తిగత సిబ్బంది కరోనా బారినపడుతున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో తిరుపతిలోని స్విమ్స్ కు ఆయన్ను తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే కరోనా బారినపడిన గన్‌మెన్ తన 18రోజులుగా సెలవులో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే రోజా గన్ మెన్ కి కరోనా అని తెలియడంతో.. ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే భయపడాల్సిన పనిలేదని కార్యకర్తలకి రోజా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Spread the love