బుద్దా వెంక‌న్నకు కరోనా పాజిటివ్

తెలుగు రాష్ట్రాల్లో కరోనా బారినపడుతున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్నకు క‌రోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ట్విట్ చేశారు.

“నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది.14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండమని డాక్టర్ సూచించారు.ఈ 14 రోజులు రాజకీయలకు దూరంగా ఉంటాను.నాకు దైవ సమానులైన మా అధినేత చంద్రబాబు గారు, అభిమానుల ఆశీస్సులతో కోవిడ్ ని జయించి, త్వరలోనే తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటాను” అని ట్విట్ చేశారు.

ఇక ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,93,090కు చేరింది. మరణాల సంఖ్య 3,633కి చేరింది.