కరోనా బారినపడిన మరో మంత్రి

ఉత్తర ప్రదేష్ లో మరో మంత్రి కరోనా బారినపడ్డారు. ఆ రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి శాఖల మంత్రి సతీష్ మహానా తనకు కరోనా పాజిటివ్‌ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంత్రి ట్విట్ చేశారు.

వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నా. గత కొద్దిరోజులుగా తనను కలిసేందుకు వచ్చిన వారు కోవిడ్‌-19 పరీక్ష చేయించుకొని జాగ్రత్తలు పాటించాలని మంత్రి అభ్యర్థించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదుగురు క్యాబినెట్ మంత్రులకు కరోనా బారినపడ్డారు. న్యాయశాఖ మంత్రి బ్రజేష్ పాఠక్‌, ఆరోగ్య మంత్రి జై ప్రతాప్ సింగ్, జలశక్తి మంత్రి మహేంద్ర సింగ్‌ వైరస్‌ బారినపడిన విషయం తెలిసిందే.