వల్లభనేని వంశీకి కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా బారినపడుతున్న ప్రజా ప్రతినిధుల జాబితా పెరుగుతోంది. ఇప్పటికే ఏపీలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌కి కరోనా బారినపడ్డారు. శనివారం నిర్వహించిన పరీక్షలలో ఆయన కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనను 14 రోజులు హోం క్వారంటైన్‌లోకి ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఇటీవల వంశీని కలిసిన వారిలో టెన్షన్ నెలకొంది.

ఏపీలో కరోనా కేసుల సంఖ్య 8లక్షలు దాటింది. శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో కొత్తగా 3,765 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 8,00,684కు చేరుకున్నాయి. ఇప్పటివరకు 74.28లక్షల టెస్టులు చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా కరోనాను జయించిన 4,281 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కొవిడ్ నుంచి కోలుకున్నవాళ్ల సంఖ్య 7,62,419కు పెరిగింది. ప్రస్తుతం ఏపీలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 31,771గా ఉంది.