గుడ్ న్యూస్ : రికవరీ పెరుగుతోంది

గతకొన్ని రోజులుగా దేశంలో నిత్యం నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల కంటే కోలుకుంటున్న వారిసంఖ్య అధికంగా ఉంటోంది. గడిచిన 24గంటల్లో 81,514 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు వైరస్‌ నుంచి కోలుకున్న వారిసంఖ్య 64లక్షలకు చేరింది. దాదాపు 79శాతం రికవరీ కేసులు పది రాష్ట్రాల్లోనే ఉన్నాయని..దీంతో దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 87శాతం దాటినట్లు కేంద్రం వెల్లడించింది.

ఆగస్టు నెలలో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి (డబ్లింగ్‌) 25రోజుల సమయం పడితే ప్రస్తుతం అది 73రోజులకు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. స్వల్ప కాలంలోనే 25రోజుల నుంచి 73రోజులకు పెరగడం వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు సూచికగా ప్రభుత్వం భావిస్తోంది.