గుడ్ న్యూస్ : కరోనా రికవరీ రేటు పెరుగుతోంది

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య 25వేలకి పైగా నమోదవుతున్నాయ్. అదే సమయంలో కరోనా రికవరీ రేటు కూడా పెరుగుతుండటం ఊరటని కలిగించే విషయం. దేశంలో ఇప్పటి వరకు ఏడు లక్షల 90 వేలు పైగా కేసులు నమోదయ్యాయి.

మరోవైపు దేశంలో నేటి వరకు 495000 మంది రికవర్ అయ్యారు. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ దేశంలో కరోనా రోగుల రికవరీ 63 శాతం ఉన్నట్లు ఆయన తెలియజేశారు. అలాగే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల మరణాల రేటు 2.72% గా ఉన్నట్లు తెలియజేశారు. అలాగే దేశంలో పెరుగుతున్న కేసుల సంఖ్య పట్ల ఎలాంటి ఆందోళన లేదని ఎక్కువ స్థాయిలో కేసులను కనుగొనేందుకు టెస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.

Spread the love