రేపటి నుంచి కరోనా టెస్టులు

తెలంగాణలో కరోనా టెస్టులు రేపటి నుంచి తిరిగి మొదలవ్వనున్నాయ్. సోమవారం మంత్రి ఈటెల మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో కరోనాతో 240మంది చనిపోయారు. దిల్లీ, ముంబయి, కోల్‌కతాలో పెరిగినట్టే హైదరాబాద్‌లోనూ కేసులు పెరిగాయి. మిగతా నగరాల్లో ఉన్నంత విస్తృతి హైదరాబాద్‌లో లేదు అన్నారు.

రేపటి నుంచి మళ్లీ కరోనా పరీక్షలు కొనసాగిస్తాం. హైదరాబాద్‌లో కరోనా కేసులు ఉన్నచోట కంటైన్‌మెంట్‌జోన్లు పెడతాం. అవసరమైతే హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌పై ఆలోచన చేయాల్సి ఉంటుందని సీఎం చెప్పారు. నాలుగైదు రోజుల్లో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేల మందికి చికిత్స అందిస్తామని ఈటెల చెప్పారు.