కరోనా టెస్టుల రేట్లని తగ్గించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ల్యాబుల్లో కరోనా టెస్ట్‌ల ధరలను కుదిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వం పంపిన శాంపిల్స్ టెస్టుకు రూ. 2400 ఉన్న ధరను రూ. 1600కు కుదించింది.

ఇక, ప్రైవేట్ ల్యాబ్స్‌లో టెస్ట్ కోసం గతంలో నిర్దేశించిన రూ. 2900 ధరను రూ. 1900 కుదిస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. టెస్ట్ కిట్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి రావటంతో కిట్ల ధర తగ్గిందని సర్కార్ పేర్కొంది.