మరో 87మంది పోలీసులకి కరోనా

కరోనా కాటుకు పోలీసులు బలవ్వడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో మరో 87మంది పోలీసులు పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనావైరస్ బారిన పడిన మొత్తం సిబ్బంది సంఖ్య 1,758కు చేరుకుంది. ఇందులో 183 మంది ఉన్నతాధికారులు ఉన్నారు. మరో 1575 కిందిస్థాయి సిబ్బంది ఉన్నారు.

ఇప్పటి వరకు 18 మంది పోలీసులు కరోనా కాటుకు బలయ్యారు. 673 మంది పోలీసులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇక మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 47,190కి చేరింది. మరో 1,577 మంది మృతి చెందారు. దేశంలోనే మహారాష్ట్రలో కరోనా ప్రభావం అధికంగా ఉంది.