ఇంటి వద్దే కరోనా చికిత్స

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిన కేసుల్లో తీవ్రత తక్కువగా ఉన్న రోగులను ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ లో ఉండేలా చర్యలు తీసుకోనుంది. హోమ్ క్వారంటైన్ కిట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చి, తీవ్రత తక్కువగా ఉండే వారికీ ఈ కిట్స్ ఉపయోగపడతాయి.

ఈ కిట్స్ లో 17 రోజులకు సరిపడే మెడిసిన్ ఉంటుంది. ఇందులో మాస్కులు, శానిటైజర్లు, హైడ్రాక్సీ క్లోరోక్విన్ లు, పారాసెటమాల్, యాంటిబయాటిక్స్, విటమిన్ మాత్రలు, ఎసిడిటి తగ్గించే మాత్రలతో పాటుగా కరోనా పాజిటివ్ వచ్చిన సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలను గురించి విపులంగా వివరించే బుక్ కూడా అందులో ఉంటుంది.

Spread the love