హైదరాబాద్ చేరనున్న కరోనా వాక్సీన్

దేశ ప్రజలకి కేంద్రం తీపికబురు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నెల 16న కరోనా వాక్సీన్ ని పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. దీనికోసం ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. వాక్సీన్ రాష్ట్రాలకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో రేపు కరోనా వాక్సిన్ హైదరాబాద్ చేరనుంది.

తొలి విడతలో 3 కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. తొలుత ఫ్రంట్ లైన్ కరోనా వారియర్స్‌కు, ఆ తర్వాత 50 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.. తెలంగాణ రాష్ట్రంలోనూ నెల 16 నుంచే కరోనా వ్యాక్సినేషన్‌ మొదలకానుంది. అయితే వాక్సిన్ పంపిణీ విషయంలో పొలిటికల్ రిఫరెన్స్ ఉండకూడదని స్వయంగా ప్రధాని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Spread the love